వామ్మో.. చలిపిడుగు.. పుస్తేల తాడు తెగి ముక్కలయ్యింది..

7 Jul, 2021 20:42 IST|Sakshi
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

సాక్షి, సంగెం(వరంగల్‌): అంత్యక్రియలకు హాజరైన వారిపై చలిపిడుగు పడడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. తీగరాజుపల్లికి చెందిన కారింగుల ప్రవీణ్‌కుమార్‌(35) గుండెపోటుతో మరణించగా మంగళవారం అంత్యక్రియల్లో బంధుమిత్రులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ఎస్పారెస్పీ కెనాల్‌ వద్దకు వెళ్లిన సమయంలో ఒకసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో అంతా సమీపాన ఉన్న చెట్ల కిందికి పరుగులు తీశారు.

రావి చెట్టుపై చలిపిడుగు పడడంతో దాని కింద ఉన్న 25 మంది వరకు అకస్మాత్తుగా కిందపడిపోయారు. వీరిలో కట్య్రాలకు చెందిన చెంగల రేణుక మెడలోని పుస్తేల తాడు తెగి ముక్కలు అయింది. కీర్తి తిరుపతి, మోడెం స్వరూప, రావుల శంకర్‌ ప్రసాద్, పుట్ట నరేష్, మారబోయిన రాకేష్, పూజారి నరేష్, దామోజోజు రాకేష్, డిష్‌ స్వామి, బలభద్రుని రమేష్, శ్రీదేవి తది తరులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నరేష్, రాకేష్, స్వరూపను 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు