ఆవును చంపిన పులి..?

6 Dec, 2020 05:42 IST|Sakshi

ములుగు: ములుగు జిల్లా సరిహద్దు అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు 20 రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి కొద్ది దూరంలో దేవునిగుట్ట ప్రాంతంలోని పొదల్లో ఆవు కళేబరం కనిపించడంతో స్థానికుల అనుమానాలకు బలం చేకూరుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన రైతు తమ ఆవును రోజూ మేతకోసం అడవికి పంపేవాడు. కాగా, గత నెల 25వ తేదీన అడవిలోకి మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

శనివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధి అడ్డబోలు లొద్దిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో అడవిలోకి వెళ్లిన పశువుల కాపరులు పరిశీలించగా పొదల్లో ఆవు కళేబరం కనిపించింది. దీని గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ములుగు అటవీ శాఖ సెక్షన్‌ అధికారి రమేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పరిసరాల్లో చౌడు నేల ఉండడంతో పులి జాడను నిర్ధారించలేక పోయామని ఆయన తెలిపారు. ఆవు కళేబరం దొరికిన స్థలం నర్సంపేట సరిహద్దులో ఉండడంతో అక్కడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, ఆదివారం ఉమ్మడిగా నమూనాలు సేకరిస్తామని ఆయన చెప్పారు.  

>
మరిన్ని వార్తలు