హమ్మయ్య.. గండం గట్టెక్కింది.. మహారాష్ట్రకు పయనమైన పులి

23 Nov, 2022 09:11 IST|Sakshi

బెజ్జూర్‌: కుమురంభీం జిల్లా వాసు లకు పెద్దపులి నుంచి ఊరట కలిగింది. కుమురంభీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా హడలెత్తించిన పెద్దపులి మహారాష్ట్ర వైపు పయనమైనట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బెజ్జూర్‌ రేంజ్‌ పరిధిలోని నాగవెళ్లి, మొగవెల్లి గ్రా మాల సమీపంలోని ప్రాణహిత నది దాటినట్లు ఆనవాళ్లను గుర్తించారు.

దీంతో సమీప గ్రామాల ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని వాంకిడిలో ఓ రైతును బలిగొన్న పెద్దపులి మరికొ న్ని పశువులపై కూడా దాడి చేసింది. దీంతో జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది.
చదవండి: తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు

మరిన్ని వార్తలు