దహెగాం మండలంలో పులి సంచారం 

13 Sep, 2021 04:59 IST|Sakshi
అటవీ అధికారులు గుర్తించిన పులి అడుగులు

దహెగాం(సిర్పూర్‌): కుమురం భీం జిల్లా దహెగాం మండలంలో ఆదివారం పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఐనం గ్రామ సమీపంలోని పొలాల్లోకి పులి రావడాన్ని గమనించిన కామెట సురేశ్‌ అనే వ్యక్తి గ్రామస్తులకు సమాచారం అందించాడు.

విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ ఎఫ్‌ఆర్వో పూర్ణిమ, ఎఫ్‌ఎస్‌వో సతీశ్, డీఆర్వో శ్రీధర్‌చారి గ్రామానికి వచ్చి పులి అడుగులను గుర్తించారు. ఐనం, పొలంపల్లి నుంచి తెనుగుపల్లి వైపు పులి వెళ్లినట్లు వెల్లడించారు. పులి సంచారం నేపథ్యంలో రైతు లను అప్రమత్తం చేశారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లరాదని అటవీ అధికారులు  సూచించారు. 
 

మరిన్ని వార్తలు