పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

11 Aug, 2020 10:29 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్ : జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతంలో తిప్పేశ్వర్ పులుల సంరక్షణ కేంద్రం నుంచి తప్పించుకున్న పెద్దపులి హల్‌చల్‌ చేసింది.సరిహద్దు గ్రామం కోపోమాండిలో పులి సంచరించడం అక్కడి స్థానికుల్లో భయాందోళన నెలకొంది.  సంరక్షణ కేంద్రం నుంచి పారిపోయి వచ్చిన పులి బీభత్సం సృష్టించింది. పంట పొలంలోకి దూరిన చిరుత ఒక ఆవు దూడపై దాడి చేసి చంపేసింది. దీనిని చూసిన స్థానిక ప్రజలు కర్రలు,గొడ్డళ్లతో పులిని వెంబడించారు. అయితే అది పొదల్లోకి పారిపోవడంతో పులి జాడ కోసం జల్లెడ పడుతున్నారు. తాజాగా పులి సంచరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు