కొత్తగూడలోపెద్దపులి సంచారం

21 Nov, 2022 03:11 IST|Sakshi

చింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాసులకు పెద్దపులి భయం పట్టుకుంది. రోజుకో గ్రామంలో పులి ప్రత్యక్షమవుతూ కలవరపెడుతోంది. ఆదివారం చింతలమానెపల్లి మండలం కొత్తగూడ గ్రామ శివారులోని చెరువులో నీళ్లు తాగుతూ స్థానికులకు కన్పించింది. దీంతో వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి చెరువు వద్ద పెద్దపులి అడుగులను గుర్తించారు.

పులి నీళ్లు తాగి బాబాసాగర్‌ గ్రామంవైపు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అనంతరం స్థానికులకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పించారు. కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో పెద్దపులి సంచరిస్తోందని,అప్రమత్తంగా ఉండాలని సూచిం­చారు. వ్యవసాయ కూలీలు, రైతులు గుంపులుగా పొలాలకు వెళ్లాలన్నారు. పెద్ద పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం బాబాసాగర్‌ గ్రామంలో పులి
సంచారంపై డప్పు చాటింపు వేయించారు.  

మరిన్ని వార్తలు