తెలంగాణ గ్రూప్‌-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో జర భద్రం!

2 May, 2022 15:57 IST|Sakshi

గ్రూప్‌–1లో జవాబుల ఆప్షన్ల ఎంపిక కఠినతరం

సరిగా బబ్లింగ్‌ చేయకుంటే.. ఓఎంఆర్‌ షీట్‌ మూల్యాంకనం చేయొద్దని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 పరీక్షలకు సంబంధించిన నిబంధనలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరింత కఠినతరం చేసింది. దరఖాస్తుల నుంచి ఓఎంఆర్‌ జవాబుపత్రం దాకా.. వివ రాల నమోదు, సమాధానాల గుర్తింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బబ్లింగ్‌లో ఎలాంటి తప్పిదాలు జరిగినా.. డబుల్‌ బబ్లింగ్‌ చేసినా.. ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమని ప్ర కటించింది. దరఖాస్తు చేసే సమయం నుం చే అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూ సుకుని నమో దు చేయాలని సూచించింది. 

దరఖాస్తుల ప్రక్రియ షురూ..: గ్రూప్‌–1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం  నుంచే ప్రారంభమవుతోంది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఓటీఆర్‌ (వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే గ్రూప్‌–1కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటీఆర్‌ నమోదు చేసుకోనివారు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు గ్రూప్‌–1 దరఖా స్తులను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో గ్రూప్‌–1 దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు.. వివ రాలన్నీ నింపాక కచ్చితంగా ఒకసారి ప్రి వ్యూ చూసుకుని.. క్షుణ్నంగా పరిశీలించాకే సబ్మిట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలని టీఎస్‌పీ ఎస్సీ సూచించింది.

డబుల్‌ బబ్లింగ్‌తో ట్రబుల్‌!: సాధార ణంగా ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌ టికెట్‌ నంబ ర్, ఇతర వివరాలను పూరించడానికి, సమా ధానాలను గుర్తించడానికి.. అంకెలు, అక్షరా లను వినియోగించరు. బదులుగా నిర్దేశిం చిన అంకెలున్న వృత్తాలను బాల్‌ పాయిం ట్‌ పెన్‌తో నింపాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కో వృత్తాన్ని మాత్రమే పూరించాలి. తప్పుగా వృత్తాలను పూరించిన వారు మళ్లీ అసలు వృత్తాన్ని కూడా నింపితే డబుల్‌ బబ్లింగ్‌ అంటారు. గతంలో గ్రూప్‌– 2 నియామకాల సమయంలో డబుల్‌ బబ్లింగ్‌  తీవ్ర వివాదం రేకెత్తించింది.

కొందరు అభ్య ర్థులు ఓఎంఆర్‌ షీట్‌పై డబుల్‌ బబ్లింగ్‌ చేయడం, వైట్‌నర్‌ వినియోగించడం, ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో నియామకాల ప్రక్రియ దాదాపు నాలుగేళ్లు నిలిచిపోయింది. దీంతో ఈసారి టీఎస్‌ పీఎస్సీ ముందుజాగ్రత్తగా కఠిన చర్యలను ప్రకటించింది. అభ్యర్థి డబుల్‌ బబ్లింగ్‌ చేస్తే.. సదరు జవాబు పత్రాన్ని మూల్యాం కనం చేయబోమని స్పష్టం చేసింది.  సాఫ్‌ ్టవేర్‌లో మార్పులు చేశామని, డబుల్‌ బబ్లింగ్‌ ఉన్న ఓఎంఆర్‌ షీట్లు తిరస్కరణకు గురవు తాయని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

సమస్యల పరిష్కారానికి హెల్ప్‌ డెస్క్‌
గ్రూప్‌–1 దరఖాస్తుల సమయంలో ఏవై నా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్క రించేందుకు టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య.. 040– 23542185, 040–2354 2187 నంబర్ల కు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసు కోవచ్చు. లేదా help@tspsc.gov.in ’కు ఈ–మెయిల్‌ చేయవచ్చు.  

మరిన్ని వార్తలు