ప్రతి మూడో ముద్ద తేనెటీగలు పెడుతున్నదే! 

20 May, 2023 04:54 IST|Sakshi

తేనెటీగల మనుగడను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత 

వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తే పరిఢవిల్లే జీవవైవిధ్యం  

నేడు అంతర్జాతీయ తేనెటీగల దినోత్సవం 

ప్రకృతిలో తేనెటీగల వంటి చిరుప్రాణులు లేక పోతే మన మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. మొక్కల్లో పూలు కాయలుగా మారడానికి  పరాగ సంపర్కమే కారణం. ఈ ప్రక్రియకు  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపకరిస్తూ పంటల  ఉత్పాదనలో ఈ చిరుప్రాణులు తోడ్పడటం వల్లనే మనం మూడు పూటలా తినగలుగుతున్నాం. మనం తింటున్న ప్రతి మూడో ముద్ద ముఖ్యంగా తేనెటీగల పుణ్యమే.

తేనెటీగలు లేకపోతే ఎన్నో రకాల పంటలు పండవు. అందుకే, తేనెటీగలు  అంతరిస్తే నాలుగేళ్లలోనే మానవ జాతి  అంతరిస్తుంది అన్నాడో మహనీయుడు.  తేనెటీగల ఉసురు తీస్తున్న పురుగుమందులు, కలుపుమందులు, పచ్చదనం కొరత, వ్యాధికారక క్రిముల విజృంభణ వంటి సమస్యలకు ఇప్పుడు అదనంగా ‘వాతావరణ మార్పులు’తోడయ్యాయి. అందువల్ల కరువు, కుంభవృష్టి వంటి వాతా వరణ మార్పు ప్రభావాల  నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ తేనెటీగలను సైతం కనిపెట్టుకుని ఉండాలి.   – సాక్షి సాగుబడి డెస్క్‌  


మనం ఏం చేయగలం?  
అటవీ ప్రాంతాలను నాశనం  చేయకుండా ఉండటం..  
♦ గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల మీద రకరకాల స్థానిక రకాల పూల మొక్కల్ని పెంచటం..  
నగరాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల్లో, మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో, ముఖ్యంగా రోడ్ల పక్కన ఖాళీ జాగాల్లో కూడా మొక్కలతోపాటు స్థానిక జాతుల పూల మొక్కల్ని విస్తృతంగా పెంచటం..  
♦ రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు చల్లకుండా ఉండటం..  
తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహించటం వంటి పనులను మనం చేస్తుంటే జీవవైవిధ్యం పరిఢవిల్లుతుంది. తేనెటీగల వంటి చిరు జీవులు మనుగడ సాగిస్తాయి. మనల్ని రక్షిస్తాయి.. 

తేనెటీగలు.. కొన్ని వాస్తవాలు 
♦ తేనెటీగ సగటు జీవితకాలం పనిచేసే కాలంలో సుమారు 1.5 నెలలు; పని లేని సీజన్‌లో సుమారు 2.5 నెలలు. ∙అర కిలో తేనె ఉత్పత్తికి 556 తేనెటీగలు పని చేయాల్సి ఉంటుంది.  
 తేనెటీగల సంతతి వసంత రుతువులో 15,000 ఉంటుంది. వేసవిలో 80,000 వరకు ఉంటుంది.  
 2021లో ప్రపంచవ్యాప్తంగా సహజంగా ఉత్పత్తయిన తేనె: 1.77 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు


20,000  ప్రకృతిలో ఉన్న  తేనెటీగల జాతులు.. 

పరాగ సంపర్కానికి దోహదపడే.. అంతరించిపోయే ముప్పుఎదుర్కొంటున్న సకశేరుక (వెన్నెముక ఉన్న) జాతులు 16.9 

అంతరించిపోతున్న తేనెటీగలు, సీతాకోక చిలుకలు  వంటి అకశేరుక (వెన్నెముక లేని) జాతులు  40%

తేనెటీగలు తదితర కీటకాల పరాగసంపర్కమే ఆధారం. 

పుష్పించే అడవి మొక్కలు/చెట్లలో తేనెటీగలు/జంతువుల పరాగసంపర్కంపై ఆధారపడుతున్నవి.  90%

ప్రపంచవ్యాప్తంగా పరాగసంపర్కంపై ఆధారపడి ఉన్న ఆహార పంటలు. 75%

మరిన్ని వార్తలు