టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

21 Jan, 2021 08:01 IST|Sakshi

ఏపీలో సరికొత్త చరిత్ర.. ఇక ఇంటికే బియ్యం
పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేస్తూ నూతన ఒరవడికి నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రేషన్‌ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను నాడు పాదయాత్ర సమయంలో స్వయంగా గుర్తించిన సీఎం జగన్‌ ఇంటివద్దే వాటిని అందచేస్తామని మాట ఇచ్చారు. పూర్తి వివరాలు..

ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్‌!

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అధికారులు కీలక మార్పులు చేశారు. జాబితాలో పేరుండీ నిర్దేశిత రోజున వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి మరోసారి టీకా వేసే అవకాశం ఇవ్వరాదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎవరైనా వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కేటాయించినరోజు రాకపోతే, అందుబాటులో ఉన్న ఇతర అర్హులైన వారికి వేయాలని, తద్వారా వేగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. పూర్తి వివరాలు..

ఏడాదిన్నరపాటు అమలు నిలిపివేత!

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం–రైతు సంఘాల మధ్య జరిగిన 10వ దఫా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ నెల 22వ తేదీన మరోసారి భేటీ కావాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. వ్యవసాయ చట్టాల అంశంలో ఎవరి పట్టు వారిదే అనే పరిస్థితి కొనసాగుతుండడంతో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు చేసింది. మూడు కొత్త చట్టాల అమలును ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని, ఈ చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వ.. పూర్తి వివరాలు..

చరిత్ర సృష్టించిన జో బైడెన్‌

భద్రత బలగాల పటిష్ట పహారా మధ్య బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. క్యాపిటల్‌ భవనంలో సంప్రదాయంగా ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. తమ కుటుంబానికి చెందిన 127 ఏళ్లనాటి బైబిల్‌పై ప్రమాణం చేసి బైడెన్‌ దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. పూర్తి వివరాలు..

ఓటీటీలో బెల్‌ బాటమ్‌?

కోవిడ్‌ వల్ల థియేటర్స్‌లో రిలీజ్‌ కావాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్‌లో ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద స్టార్‌ హీరో సినిమా అక్షయ్‌ కుమార్‌దే. ఆయన నటించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌ ‘లక్ష్మీ’ను డిస్నీ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల చేశారు. తాజాగా అక్షయ్‌ కుమార్‌ కొత్త చిత్రం ‘బెల్‌బాటమ్‌’ కూడా ఓటీటీలోనే విడుదల కానుందని బాలీవుడ్‌ టాక్‌. పూర్తి వివరాలు..

షకీబ్‌ మాయాజాలం

వెస్టిండీస్‌తో ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ (4/8) విజృంభించాడు. దాంతో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 6 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముందుగా వెస్టిండీస్‌ 32.2 ఓవర్లలో 122 పరుగులకే  కుప్పకూలింది. కెల్‌ మయేర్స్‌ (40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), పావెల్‌ (31 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు పరుగులు సాధించలేకపోయారు. పూర్తి వివరాలు..

పారదర్శకతే లక్ష్యం..​​​​​​​

ప్రైవసీ పాలసీలో ప్రతిపాదిత మార్పులను ఉపసంహరించుకోవాలంటూ కేంద్రం ఆదేశాల నేపథ్యంలో మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ స్పందించింది. ప్రతిపాదిత అప్‌డేట్‌ వల్ల మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను మరింతగా పంచుకోవడమనేది జరగదని వివరించింది. పారదర్శకంగా వ్యవహరించడమే తమ లక్ష్యమని పేర్కొంది. పూర్తి వివరాలు..​​​​​​​

ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు
జాత్యహంకారం. కించపరిచే మాటలు. ఒళ్లంతా గాయాలు. అంతిమంగా.. ఒక ఘన విజయం. ముప్పై రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలోని ‘గాబా గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గ్రౌండ్‌ బ్రేకింగ్‌ విక్టరీ సాధించింది. 2–1తో టెస్ట్‌ సిరీస్‌ గెలుచుకుంది. ముగ్గురు హీరోలు. మొహమ్మద్‌ సిరాజ్‌. అతడి వెనుక ఉన్న జీవ శక్తి అతడి తల్లి షబానా. ఇంకో హీరో రవిచంద్రన్‌ అశ్విన్‌. పూర్తి వివరాలు..​​​​​​​

అమ్మా, నాన్న ఇక సెలవు

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తండ్రి వ్యాపారం బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన  బుధవారం రాత్రి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. సీఐ జి.గంగాధరరావు అందించిన సమాచారం మేరకు.. పొదలకూరు పట్టణానికి చెందిన భార్యా భర్తలు తన్నీరు రాఘవేంద్ర, రత్నమ్మ మెయిన్‌ బజార్లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు..​​​​​​​
​​​​​​​

‘పచ్చ’కుట్రపై పెదవి విప్పవేం బాబూ! 

విగ్రహ రాజకీయాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తనకు తానే రాజకీయ సమాధి కట్టుకుంటున్నాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గుడిలో నందీశ్వరుడి విగ్రహన్ని రోడ్డుపైకి తెచ్చి న ఘటన వెనుక టీడీపీ హస్తముందని తేలిందన్నారు. అందుకే ఆ పార్టీ నేతలు నోరువిప్పడం లేదని చెప్పారు. పూర్తి వివరాలు..​​​​​​​

మరిన్ని వార్తలు