టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

5 Jan, 2021 08:18 IST|Sakshi

మంచి చేస్తుంటే.. గుడులపై దాడులా?
రాజకీయాల కోసం దేవుడిని కూడా వదలడం లేదంటూ.. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసే సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం రాకూడదనే దుర్బుద్దితోనే ఇలాంటి కుట్రలకు తెర తీస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాలు.. 


పండుగ తరువాతే టీచర్ల బదిలీ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ ప్రక్రియను సంక్రాంతి సెలవుల అనంతరమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. పండుగ సెలవుల తర్వాతే ఆయా టీచర్లు తమకు కేటాయించిన కొత్త పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. పూర్తి వివరాలు..

ఈ నెల 31లోగా.. పదోన్నతులు పూర్తి

ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పురోగతిపై  తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది. ఈ నెలాఖరు వరకు పదోన్నతులు, నియామకాల ప్రక్రియకు సంబంధించి ప్రతీ వారం (జనవరి 6, 12, 20, 27 తేదీల్లో) సమీక్షా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించారు. పూర్తి వివరాలు...

కరోనా: 11న తొలి టీకా?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమ యం వచ్చేసింది..! వారంలోనే తెలంగాణలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి అందిన సంకేతాల మేరకు ఈ నెల 11న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఒక కీలకాధికారి సోమవారం తెలిపారు. పూర్తి వివరాలు..

రైతులతో చర్చలు అసంపూర్ణం

వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఉద్యమిస్తున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. పూర్తి వివరాలు.. 

డయాలసిస్‌ పేషెంట్లకు ఆక్స్‌ఫర్డ్‌ టీకా

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా కలిసి తయారు చేసిన కోవిడ్‌–19 టీకా వ్యాక్సినేషన్‌ ప్రపంచంలోనే ప్రప్రథమంగా సోమవారం యూకేలో మొదలైంది. డయాలసిస్‌ పేషెంట్లకు ముందుగా ఈ టీకాను ఇస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌లో డయాలసిస్‌ రోగి బ్రియాన్‌ పింకెర్‌(82)కు మొదటగా టీకా వేశారు. పూర్తి వివరాలు..

రామతీర్థం ఘటనపై  సీఐడీ విచారణ

రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటీవల ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీస్, దేవదాయ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలు..


లేడీ విజయ్‌ సేతుపతి అనిపించుకోవాలనుంది

తెలుగు సినిమాల్లో రెండో హీరోయిన్‌ పాత్రలే చేస్తున్నారెందుకు? అని అడుగుతున్నారు.. నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా.. ప్రాధాన్యం ఉంటే చాలు.. అది మొదటి హీరోయినా? రెండో హీరోయినా? అనేది చూడను’’ అన్నారు హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌. నివేదా చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలు..


హమ్మయ్య! అందరికీ నెగెటివ్‌

హమ్మయ్య! భారత క్రికెటర్లకే కాదు... క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కే ఇది పెద్ద ఊరట. ఆటగాళ్లంతా కోవిడ్‌–19 పరీక్షల నుంచి నెగెటివ్‌గా బయటపడ్డారు. దీంతో ఈనెల 7 నుంచి సిడ్నీలో జరిగే మూడో టెస్టుకు వచ్చిన ముప్పేమీ లేదిపుడు. పూర్తి వివరాలు..

అమెజాన్‌ ఏమాత్రం సహాయం చేయలేదు..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటాల విక్రయ వివాదానికి సంబంధించి ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా వాటాదారైన అమెజాన్‌పై ఫ్యూచర్‌ మరిన్ని ఆరోపణలు గుప్పించింది. కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ అమలైన సమయంలో తాము తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ .. అమెజాన్‌ పైపై మాటలు చెప్పడం తప్ప ఏమాత్రం సహాయం అందించలేదని ఆరోపించింది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు