నేటి నుంచి జిల్లాలకు వాక్సిన్ పంపిణీ

13 Jan, 2021 10:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ జిల్లాలకు కరోనా వాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే కోఠిలోని కోల్డ్ స్టోరేజ్ కి 31 బాక్సుల్లో 3లక్షల 64వేల వాక్సిన్ డోసుల చేరుకున్నాయి. ఇదివరకే అన్ని జిల్లాలకు15లక్షల సిరంజీలు పంపిణీ పూర్తి అయింది. వాక్సిన్ డోసులు ఏ జిల్లాకు ఎన్ని పంపాలనేదానిపై ఆరోగ్యశాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో వాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం జరుగనుంది.

99 వాక్సిన్ సెంటర్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు, పీహెచ్ సీ పంపిణికి సిద్ధంగా ఉండగా.. అలాగే 40 సెంటర్లు ప్రయివేట్ ఆస్పత్రులు, టీచింగ్ కాలేజీల్లో పంపిణి కోసం ఏర్పాట్లు చేసారు. గాంధీ, నార్సింగ్ లోని వాక్సిన్ సెంటర్ల ద్వారా 16న మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంట్రాక్టు కానున్నారు.. మిగతా 137 సెంటర్లలో మోడీ స్పీచ్ లైవ్ టెలికాస్ట్ ఉండనుంది.

మరిన్ని వార్తలు