నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు

15 Jun, 2021 01:49 IST|Sakshi

ఈనెల 25 వరకు లబ్ధిదారులందరికీ పెట్టుబడి సాయం అందజేత

సాక్షి, హైదరాబాద్‌: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వర్షాలు పడుతున్న కీలకమైన సమయంలో రైతులకు నగదు జమ కావడం ఎంతో ఊరటనిచ్చే అంశం. మంగళవారం ఒక ఎకరా వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుబంధు నిధులు వేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్‌రావు తెలిపారు. గత సీజన్‌లో మాదిరిగానే జమ చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 వరకు రైతుబంధు సొమ్ము అందరికీ అందుతుందన్నారు. ఈ సీజన్‌లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ.7,508 కోట్ల నిధులు అందుతాయి. గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది కొత్తగా రైతులు పెరిగిన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు