టోల్‌ చార్జీలు పెంపు

30 Mar, 2022 22:36 IST|Sakshi

ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలు 

కార్లు, జీపులకు 5 నుంచి 8 శాతం.. లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు 10 నుంచి 15 శాతం పెంపు 

బెంగళూరు హైవేపై సెప్టెంబర్‌లో పెంపు 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల్లో చార్జీలు పెరిగాయి. రాష్ట్రంలో ఉన్న 29 ప్లాజాల్లో హైదరాబాద్‌–బెంగళూరు హైవే మినహా మిగతా టోల్‌ ప్లాజాల రుసుములను ఎన్‌హెచ్‌ఏఐ సవరించింది. బెంగళూరు హైవేలో ఓ కాంట్రాక్టరుతో ఉన్న ఒప్పందం ప్రకారం కొత్త ధరలు సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి. మిగతా టోల్‌ ప్లాజాల్లో ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

ఆయా రోడ్ల నిడివి, వెడల్పు, వాటి మీద ప్రయాణించే వాహనాల సంఖ్య, టోల్‌ గేట్ల సామర్థ్యం, నిర్వహణ వ్యయం.. ఇలా పలు అంశాల ప్రాతిపదికగా టోల్‌ ధరలను సవరించారు. కార్లు, జీపులు లాంటి వాహనాలకు 5 నుంచి 8 శాతం, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు 10 నుంచి 15 శాతం, బస్సులు, ట్రక్కులకు 10 నుంచి 15 శాతం చార్జీలు పెరిగాయి. ఆయా కేటగిరీల్లో రూ. 5 నుంచి 50 వరకు ధరలు పెరిగాయి. టోల్‌ ధరలను ఏటా ఏప్రిల్‌ ఒకటిన సవరిస్తుంటారు.  

ఆర్టీసీ కూడా: తాజాగా ఆర్టీసీ కూడా టోల్‌ రుసుమును జనం జేబుపై వేసింది. అన్ని బస్సులకు కలిపి ఒకేసారి ఆర్టీసీ టోల్‌ రుసుములను చెల్లిస్తుంది. గత నాలుగేళ్లుగా టోల్‌ రుసుములను సంస్థ సవరించలేదు. గత ఏడాది కాలంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసిన మొత్తం కంటే టోల్‌ నిర్వాహకులకు చెల్లించిన మొత్తం రూ.8 కోట్లు ఎక్కువని ఇటీవల  గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం ఆర్టీసీ కూడా టికెట్‌ రేట్లలో టోల్‌ వాటాను పెంచింది.  

గతేడాది టోల్‌ చార్జి, ఏప్రిల్‌ ఒకటి నుంచి అమలయ్యే కొత్త రేట్లు (మొదటిది పాత, రెండోది కొత్త) ఇలా ఉన్నాయి. 

హైదరాబాద్‌విజయవాడ హైవే పై పంతంగి:
కారు, జీపు వ్యాన్‌ ఇతర లైట్‌ వెహికిల్స్‌కు సింగిల్‌ ట్రిప్‌ ఛార్జి రూ.80 నుంచి రూ.90కి, రిటర్న్‌ జర్నీతో కలిపి ఛార్జి రూ.120 నుంచి రూ.135కు, నెల పాస్‌ ఛార్జి రూ.2690 నుంచి రూ.2965కు పెరిగాయి. లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ ఛార్జి రూ.130 నుంచి రూ.140కి, రిటర్న్‌ జర్నీ రూ.190 నుంచి రూ.210కి, నెలపాస్‌ రూ.4255 నుంచి రూ.4685కు పెరిగాయి. బస్, ట్రక్కుల సింగిల్‌ ట్రిప్‌ రూ.265 నుంచి రూ.290కి, రిటర్న్‌ జర్నీ ఛార్జి రూ.395 నుంచి రూ.435కు, నెల పాస్‌ రూ.8795 నుంచి రూ.9685కు, ఓవర్‌సజ్డ్‌ వెహికిల్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.510 నుంచి రూ.560కి, రిటర్న్‌ జర్నీ రూ.765 నుంచి రూ.845కు, నెలపాస్‌ రూ.17010 నుంచి రూ.18740కి పెరిగాయి. 

కోర్లపహాడ్‌: కార్లు, జీపుల సింగిల్‌ ట్రిప్‌ రూ.110 నుంచి రూ.120కి, రిటర్న్‌ జర్నీ రూ.165రూ.180, నెలపాస్‌ రూ.3650రూ.4025, లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ ఛార్జి రూ.175రూ.190, రిటర్న్‌ జర్నీ రూ.260రూ.285, నెలపాస్‌రూ.5795రూ.6385, బస్సు, ట్రక్కుల సింగిల్‌ ట్రిప్‌ రూ.360రూ.395, రిటర్న్‌ జర్నీ ఛార్జి రూ.540రూ.595, నెలపాస్‌ రూ.12020రూ.13240, ఓవర్‌సైజ్డ్‌ హెవీ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.695రూ.765, రిటర్న్‌ జర్నీ రూ.1045రూ.1150, నెలపాస్‌ రూ.23190రూ.25545కు పెరిగాయి. 

చిల్లకల్లు టోల్‌గేట్‌: జీపు కార్ల సింగిల్‌ ట్రిప్‌ రూ.90 రూ.100, రిటర్న్‌ జర్నీ ఛార్జి రూ.135రూ.150, నెలపాస్‌ రూ.3040రూ.3350, లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.145రూ.160, రిటర్న్‌ జర్నీ రూ.215రూ.240, నెల పాస్‌ రూ.4805రూ.5290, బస్సు, ట్రక్కు సింగిల్‌ ట్రిప్‌ రూ.300రూ.330, రిటర్న్‌ జర్నీ రూ.445రూ.490, నెల పాస్‌ రూ.9930రూ.10940, ఓవర్‌సైజ్డ్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.575రూ.635, రిటర్న్‌ జర్నీ రూ.865రూ.955, నెల పాస్‌ రూ.19215రూ.21170.

ఎన్‌హెచ్‌ 163 పై ఉన్న కొమల్ల టోల్‌ప్లాజాలో కార్లు, జీపులకు  సింగిల్‌ ట్రిప్‌ పాత ధర రూ.100 కొత్త ధర రూ.110, రిటర్న్‌ జర్నీకి రూ.145170,  నెలపాస్‌కు రూ.32603745.
► లైట్ కమర్షియల్‌ వాహనాలకు సింగిల్‌ జర్నీ రూ.160180,  రిటర‍్న జర్నీకి రూ.235270, నెల పాస్‌కు రూ.52653745, బస్సులు,ట్రక్కు సింగిల్‌ ట్రిప్‌కు రూ.330 రూ.380, రిటర‍్న జర్నీకి 495570, నెల పాస్‌కు రూ.1103012675, సెవన్‌ యాక్సల్‌ అంతకంటే హెవీ వెహికిల్‌‍్సకు సింగిల్‌ ట్రిప్‌ రూ.630725, రిటర్న్‌ జర్నీకి రూ.9451090, నెలపాస్‌కు 2105524195. 
► ఎన్‌హెచ్‌ 163 పై ఉన్న గూడూరు ప్లాజాలో కార్లు, జీపుల సింగిల్‌ ట్రిప్‌కు రూ.100110, రిటర్న్‌ జర్నీకి రూ.150 రూ.165, నెల పాస్‌ రూ.3290రూ.3620, లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌కు సింగిల్‌ ట్రిప్‌ రూ.150 రూ.165, రిటర్న్‌ జర్కీకి రూ.225 250, బస్, ట్రక్కులకు సింగిల్‌ ట్రిప్‌ రూ.305రూ.340, రిటర్న్‌ జర్నీకి రూ.460రూ.505, నెల పాస్‌కు రూ.10225రూ.11265. ఓవర్‌సైజ్డ్‌ హెవీ వెహికిల్‌‍్స సింగిల్‌ ట్రిప్‌కు రూ.605రూ.665, రిటర్న్‌ జర్నీకి రూ.905 రూ.1000, నెల పాస్‌కు రూ.20160రూ.22210

► ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్‌7పై ఉన్న రోల్‌మామ్డా టోల్‌ప్లాజా ధరలల్లో మార్పు ఇలా: కార్లు జీపులు సింగిల్‌ ట్రిప్‌ రూ.90 రూ.100, రిటర్న్‌ జర్నీ రూ.135రూ.150, నెలపాస్‌ రూ.2980 రూ.3285, లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.145రూ.160, రిటర్న్‌ జర్నీ రూ.215రూ.240, నెలపాస్‌ రూ.4815 రూ.5305, బస్, ట్రక్కు సింగిల్‌ ట్రిప్‌ రూ.330 రూ.335, రిటర్న్‌ జర్నీకి రూ.455రూ.500, నెలపాస్‌ రూ.10090 రూ.11110, ఓవర్‌సైజ్డ్‌ హెవీవెహికిల్‌ సింగిల్‌ ట్రిప్‌ రూ.580రూ.635, రిటర్న్‌ జర్నీ రూ.865రూ.955, నెలపాస్‌ రూ.19260రూ.21215
► ఎన్‌హెచ్‌44పై ఆర్మూర్‌ఎల్లారెడ్డి సెక‌్షన్‌ పరిధిలోని ఇందల్వాయి టోల్‌ధరలు పాతకొత్త ఇలా.. కార్లు, జీపుల సింగిల్‌ ట్రిప్పుకు రూ.75రూ.80, రిటర్న్‌ జర్నీకి రూ.110రూ.125, నెలపాస్‌కు రూ.2470రూ.2720, లైట్‌ కమర్షియల్‌ వాహనాల సింగిల్‌ ట్రిప్పు రూ.120రూ.130, రిటర్న్‌ జర్నీ రూ.180 రూ.200, నెలపాస్‌ రూ.3990రూ.4395, బస్, ట్రక్కు సింగిల్‌ ట్రిప్పు రూ.250రూ.275, రిటర్న్‌ జర్నీ రూ.375రూ.415, నెలపాసు రూ.8365రూ.9215

మరిన్ని వార్తలు