Top News Headlines: ఇవ్వాళ్టి టాప్‌ హెడ్‌లైన్స్‌

3 Feb, 2023 19:49 IST|Sakshi

► రైల్వే ప్రాజెక్టుల కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు కలిపి రూ.12800 కోట్లు కేటాయించామన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

► ముగిసిన కళాతపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు, ఏపీ ప్రభుత్వం తరపున పాల్గొన్న  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

► జగనన్న విదేశీ విద్యాదీవెన కింద  213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

► రెండేళ్ల తరువాత అసెంబ్లీకి గవర్నర్ తమిళి సై, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం, వెంటే ఉన్న సీఎం కెసిఆర్‌

► ఆదానీ గ్రూప్‌కు మరో షాక్‌, ఫిబ్రవరి 7 నుంచి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ డోజోన్స్‌ నుంచి ఆదానీ ఎంటర్‌ప్రైస్‌ స్టాక్‌ ఔట్‌

► ఆదానీ ఇష్యూతో అట్టుడికిన రాజ్యసభ, చర్చించాలని పట్టుబట్టిన విపక్షాలు

► గుజరాత్‌ అల్లర్లపై బిబిసి డాక్యుమెంటరీని ఎందుకు నిషేధించారో ఆధారాలతో సహా తెలపండి : కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

► కొలిజీయం ఇచ్చిన ఐదు పేర్లను త్వరలోనే పూర్తి చేసి సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తామని తెలిపిన కేంద్రం

► శారద కుంభకోణం:  కాంగ్రెస్‌ నేత చిదంబరం భార్య నళినికి చెందిన రూ.6 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ

► మహారాష్ట్రలో బీజేపీకి షాక్‌, అమరావతి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహావికాస్‌ అఘాడీ అభ్యర్థి విజయం

► బీహార్‌: ప్రాచీన నలందా యూనివర్సిటీకి చెందిన 1200 ఏళ్ల నాటి విగ్రహాలను వెలికి తీసిన పురావస్తుశాఖ అధికారులు

► అమెరికాలో అనుమానస్పద బెలూన్‌ స్వాధీనం, నిఘా కోసం చైనా ప్రయోగించిందని అనుమానాలు

► పాక్‌లో 18 రోజులకే  సరిపడా విదేశీ మారకపు నిల్వలు, రుణాల పునరుద్ధరణపై IMF మరీ కఠినంగా వ్యవహరిస్తోంది: పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

► 2007 టీ20 వరల్డ్‌ కప్‌ టీంలో సభ్యుడు జోగిందర్‌ శర్మ క్రికెట్‌కు గుడ్‌బై, ప్రస్తుతం హర్యానా పోలీసు శాఖలో డీఎస్పీగా బాధ్యతలు

మరిన్ని వార్తలు