అంతా 20 నిమిషాల్లోనే..

12 Feb, 2021 08:57 IST|Sakshi

ఆలింగనం.. పాదాభివందనం.. 

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో సంశయాలు.. ఊహాగానాలు.. మరెన్నో అంచనాలను పటాపంచలు చేస్తూ జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోటీ జరిగినప్పటికీ.. మేయర్‌ ఎన్నికకు 4, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు 4 నిమిషాలు చొప్పున 8 నిమిషాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, అది ముగిశాక 12.30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలు పూర్తి చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను టీఆర్‌ఎస్‌ సునాయాసంగా గెలుచుకుంది. మేయర్‌గా రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ గద్వాల విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్‌గా టీఆర్‌ఎస్‌ నాయకుడు మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌కు 32 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులున్నప్పటికీ అందరూ హాజరు కాలేదు. విప్‌కు అనుగుణంగానే అందరూ వ్యవహరించారని విప్‌ జారీ చేసిన ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు తగినంత బలమున్నందున ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విని యోగించుకునేందుకు వీలుగా పారీ్టయే వారిని రావద్దని సూచించినట్లు తెలిపారు. హాజరుకాని వారిలో లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బి.లక్ష్మీనారాయణ, ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ తదితరులున్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌కు మాత్రం విప్‌ జారీ కాలేదని సమాచారం. ఆయన సమావేశానికి హాజరు కాలేదు. మేయర్‌గా ఎన్నికయ్యాక గద్వాల విజయలక్ష్మి సభలోనే ఉన్న తన తండ్రి కేశవరావుకు పాదాభివందనం చేశారు.

అనంతరం సభ్యులందరికీ విడివిడిగా ధన్యవాదాలు తెలిపారు. సన్నిహితులను ఆలింగనం చేసుకున్నారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు టీఆర్‌ఎస్, ఎంఐఎం సభ్యులంతా ఓట్లు వేశారు. బీజేపీ అభ్యర్థులకు కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ఓట్లు వేశారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, లింగోజిగూడ కార్పొరేటర్‌ మృతి చెందడంతో ప్రస్తుతం 149 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు ఎన్నికలో పాల్గొనలేదు. మిగతా 147 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఓటున్న అయిదుగురు రాజ్యసభ సభ్యుల్లో డి.శ్రీనివాస్, వి.లక్ష్మీకాంతరావు హాజరు కాలేదు.15 మంది ఎమ్మెల్సీల్లో 10 మంది, 21 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది హాజరైనట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. ఎంపీలు కిషన్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ సైతం పోలింగ్‌లో పాల్గొనలేదు. ఎమ్మెల్సీ కవిత పలువురికి సూచనలిస్తూ కనిపించారు. మంత్రి తలసాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టీఆర్‌ఎస్‌ సభ్యులకు సూచనలిచ్చారు.
చదవండి: ‘మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ’
మేయర్‌ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి

తెలిసినా తగ్గలేదు
సాక్షి, సిటీబ్యూరో: మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ తమవద్ద లేదని తెలుసు. అయినా బీజేపీ తమ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు బరిలోకి దించింది. అప్పటి వరకు పైకి చూసేందుకు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష మజ్లిస్‌లు తీరా ఓటింగ్‌ సమయం ఒక్కటవడంతో ఆ పారీ్టకి ఓటమి తప్పలేదు. ఎన్నికల సమయంలో ఆ రెండు పారీ్టలు పన్నిన కుట్రలను, కొనసాగిస్తూ వస్తున్న అంతర్గత సంబంధాలను బహిర్గతం చేయడంలో బీజేపీ సక్సెస్‌ అయింది. కౌన్సిల్‌ వేదికగా అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష మజ్లిస్‌ల అపవిత్ర పొత్తులను బహిర్గతం చేసి ఆందోళనకు దిగింది. ఆ రెండు పార్టీలపై తీవ్రంగా మండిపడింది.  

సంఖ్యాబలం లేదని తెలిసీ.. 
ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 56 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 48 స్థానాలు, కాంగ్రెస్‌ 2 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో లింగోజిగూడ కార్పొరేటర్‌ ఆకుల రమేష్‌గౌడ్‌ ప్రమాణ స్వీకారాణికి ముందే మృతి చెందారు. దీంతో బీజేపీ సీట్ల సంఖ్య 47కు చేరింది. ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో మేయర్‌ ఎన్నికకు ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. అధికార టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌అఫిíÙయో ఓట్లు 32 ఉండగా, బీజేపీకి 2, ఎంఐఎంకు 10 ఉన్నాయి. అయితే అధికార టీఆర్‌ఎస్‌కు కార్పొరేటర్‌ సహా ఎక్స్‌ అఫిషియో ఓట్లు ఎక్కువే. తీరా ఓటింగ్‌ సమయంలో ఎంఐఎం మ ద్దతు తెలుపడంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను ఆ పార్టీ సునాయాసంగా దక్కించుకుంది. 

మరిన్ని వార్తలు