కేసీఆర్‌ ముఖ్యమంత్రా.. వాసాలమర్రి సర్పంచా?

8 Aug, 2021 01:55 IST|Sakshi

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేసీ ఆర్‌ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేక వాసాలమర్రి గ్రామానికి సర్పంచో చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ విమర్శించారు. ఆత్మగౌరవంతో బతకాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు ఉద్యోగాలు కల్పించి ఉంటే సీఎం ఇచ్చే రూ.10 లక్షల అవసరం ఎందుకు ఉండేదని అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన ప్రచార కమిటీ కో కన్వీనర్‌ అజ్మతుల్లా హుస్సేనీ, టీపీసీసీ వీవర్స్‌ సెల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవం, విద్యా, ఉద్యోగాలు, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అ యిందని అన్నారు.

నయా నిజాంలా పాలిస్తు న్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఈ నెల 9న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తోందని చెప్పారు. హుజూరాబాద్‌ ఎ న్నికల కోసమే కేసీఆర్, దళితబంధు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ వీవర్స్‌ సెల్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు