రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌

2 Jan, 2023 12:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీల నిధుల విషయంపై ఇందిరా పార్క్‌ వద్ద తలపెట్టిన ధర్నా కోసం బయలుదేరిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సమయం రేవంత్‌ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం కొనసాగింది. అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు.. రేవంత్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 

ఇంటి నుంచి బయలుదేరే ముందు ధర్నా విషయంపై మాట్లాడారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. సర్పంచ్‌ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. నిధులు కాజేసిన ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే కాంగ్రెస్‌ నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది.

ఇదీ చదవండి: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతల హౌస్‌ అరెస్ట్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు