ఆయా శాఖల్ని ప్రతివాదులుగా పిటిషన్‌ దాఖలు చేయండి 

20 Dec, 2022 04:10 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన అంశంలో రేవంత్‌రెడ్డికి ఢిల్లీ హైకోర్టు సూచన 

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన అంశంలో సంబంధిత శాఖలు, సంస్థల్ని ప్రతివాదు లుగా చేర్చి మరో పిటిషన్‌ దాఖలు చేయాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. రేవంత్‌ దాఖలు చేసిన ఓ అప్లికేషన్‌ సోమవారం సీజే జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ సుబ్రమణియమ్‌ప్రసాద్‌ ధర్మాసనం ముందుకొచ్చింది.

 2018 లో బంగారు కూలీ పేరుతో టీఆర్‌ఎస్‌ నిధులు సమీకరించిందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రతివాదిగా ఢిల్లీ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలుచేశారు. ఆయన లేవనెత్తిన అంశాలపై ఐటీ శాఖ అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తూ విచారణ ముగించింది. తాజాగా ఇదే కేసులో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారని, ఐటీశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ రేవంత్‌ రెడ్డి అప్లికేషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం సంబంధిత శాఖల్ని ప్రతివాదులుగా చేర్చుతూ మరో పిటిషన్‌ దాఖలు చేయడానికి స్వేచ్ఛనిస్తూ ఈ అప్లికేషన్‌పై విచారణ ముగించింది.   

మరిన్ని వార్తలు