హైదరాబాద్‌: సదర్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

6 Nov, 2021 12:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సదర్‌ ఉత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ సీపీ, ట్రాఫిక్‌ విభాగం ఇంచార్జి అడిషనల్‌ సీపీ చౌహాన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

కాచిగూడ ఎక్స్‌రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ మార్గాల్లో వచ్చే వాహనాలను కాచిగూడ టూరిస్ట్‌ హోటల్‌ వైపునకు మళ్లిస్తున్నారు. నారాయణగూడ విఠల్‌వాడీ ఎక్స్‌రోడ్స్‌ నుంచి వైఎంసీఏ నారాయణగూడ వైపు వచ్చే వాహనాలు రామ్‌కోఠి ఎక్స్‌రోడ్స్‌ వైపు వెళ్లాల్సి ఉంది. 

రాజమోహల్లా నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రామ్‌కోఠి సాబూ షాప్‌ పాయింట్‌ నుంచి డైవర్ట్‌ అవ్వాలి. రెడ్డి కాలేజీ నుంచి వచ్చే వాహనాలు బర్కత్‌పురా వైపునకు వెళ్లాలి. ఓల్డ్‌ బర్కత్‌పురా పోస్ట్‌ ఆఫీస్‌ నుంచి వైఎంసీఏ వచ్చే వాహనాలు క్రౌన్‌ కేఫ్‌ నుంచి వేరే మార్గం ద్వారా వెళ్లాలి. శనివారం రాత్రి 7 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు చౌహాన్‌ తెలిపారు. (సదర్‌ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు)

మరిన్ని వార్తలు