ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?

26 Jan, 2021 16:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతీ ఏడాది ప్రభుత్వం, పోలీసులు అనేక చర్యలను చేపడుతున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నా వారి నిర్లక్ష్యం కారణంగా నిత్యం రహదారులు రక్తసిక్తమవుతునే ఉన్నాయి. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నా.. వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు పలు రకాలుగా వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగే అనర్థాలను వివరిస్తూ ట్రాఫిక్‌ పోలీసులు సోషల్‌ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. చదవండి: 16 హత్యలు: సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌..

తాజాగా ‘ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?’ అంటూ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. రాజేంద్రనగర్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన బైక్ రైడర్లకు సంబంధించి.. సీసీ కెమెరా వీడియో ఫుటేజ్‌ను పోస్ట్‌ చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించకుండా అడ్డదిడ్డంగా డ్రైవ్‌ చేస్తూ ఇద్దరు బైక్‌ రైడర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యంగా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ వీడియోపై స్పందించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనే కోణంలో పోలీసులు సంధించిన ప్రశ్న ఆలోచింపజేసింది. చదవండి: ఈ దొంగ బాగా రిచ్‌, ఓ విల్లా.. 4 హైఎండ్‌ కార్లు

మరిన్ని వార్తలు