ముందుగా రండి.. రైలెక్కండి!

3 Jul, 2022 07:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. పలు రహదారులు నిర్బంధం, మళ్లింపుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ముందుగా చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ చుట్టూ 3 కి.మీ. పరిధిలో అన్ని రహదారులు, జంక్షన్లు రద్దీగా ఉంటాయని, తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్‌ ప్లాట్‌ ఫారమ్‌ నంబర్‌ 1 వైపు నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్‌ రద్దీ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు చిలకలగూడ వైపు నుంచి ప్లాట్‌ఫాం 10 నుంచి స్టేషన్‌కు చేరుకోవాలని తెలిపారు. 

  • పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు పంజాగుట్ట, వీవీ విగ్రహం, ఐమ్యాక్స్‌ రోటరీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్‌ ట్యాంక్‌ బండ్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, ముషీరాబాద్‌ క్రాస్‌ రోడ్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. తిరిగి ఇదే మార్గం గుండా పంజగుట్టకు చేరుకోవాలి. 
  • ఉప్పల్, తార్నాక, ఆలుగడ్డబావి, చిల్కలగూడ క్రాస్‌ రోడ్‌ నుంచి స్టేషన్‌కు చేరుకోవాలి 
  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, బేగంపేట, పంజాగుట్ట వరకు రద్దీగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా మార్గాలను వినియోగించకూడదు.  

(చదవండి: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే)

మరిన్ని వార్తలు