విషాదం నింపిన వన భోజనం

25 Sep, 2020 07:52 IST|Sakshi

నిజామాబాద్‌ ‌: వన భోజన సంబురం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. భోజనాల అనంతరం పాత్రలు శుభ్రం చేస్తుండగా వాగులో కొట్టుకుపోయిన పాత్ర కోసం దిగిన కవల సోదరులిద్దరూ గల్లంతయ్యారు. మోర్తాడ్‌ మండలంలో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నా యి. మోర్తాడ్‌ మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి ఖుద్రత్‌ నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఇంటికి రావడంతో వారితో సరదాగా గడిపేందుకు ఆయన గురువారం తన కుటుంబ సభ్యులను వనభోజనాల నిమిత్తం గాండ్లపేట్, దొన్కల్‌ల మధ్య ఉన్న పెద్ద వాగు పరిసరాలకు తీసుకువెళ్లాడు.

భోజనాల అనంతరం కుటుంబ సభ్యులు పాత్రలను శుభ్రం చేసే క్రమంలో ఒక పా త్ర వాగులో పడిపోయింది. దానిని తీయడానికి కవల సోద రులు తాహెర్, తయ్యూబ్‌ ప్రయత్నించారు. ఈ క్రమంలో త య్యూబ్‌ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనిని గమ నించిన సోదరుడు తాహెర్‌ అతడిని కాపాడేందుకు యతి్నంచి, అతడూ గల్లంతయ్యాడు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానిక జాలరులు, గజ ఈతగాళ్లు ఎంత ప్ర యతి్నంచినా ఫలితం లేకపోయింది. గల్లంతైనవారి కోసం మూడు గంటలపాటు గాలించామని గాండ్లపేట్‌కు చెందిన గజ ఈతగాడు మనోజ్‌ తెలిపారు.

ఇసుక, నాచు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో ఇరుక్కుపోయి ఉంటారన్నారు. ఆర్మూర్‌ ఆర్‌డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, భీమ్‌గల్‌ సీఐ సైదయ్య, మోర్తాడ్‌ తహసీల్దార్‌ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంపత్‌కుమార్‌లు గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు. వాగు ప్రవాహంలో కొట్టుకపోతే వారిని గుర్తించడానికి పాలెం, ధర్మోరాల మధ్య ఉన్న చెక్‌డ్యాం వద్ద వలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు