తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

28 Feb, 2024 17:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శేబరిష్  బదిలీ అయ్యారు.

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా భోర్ఖాడే హేమంత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా కేశవ్ పాటిల్‌ బదిలీ అయ్యారు.

whatsapp channel

మరిన్ని వార్తలు