పశుసంవర్ధక శాఖకు అధర్‌ సిన్హా

21 Jan, 2022 02:54 IST|Sakshi
అధర్‌ సిన్హా

ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణీప్రసాద్‌..

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ అధర్‌సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. వెయిటింగ్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్‌ఐ కొత్త డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.

వెయిటింగ్‌లో ఉన్న కె.నిర్మలను ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శిగా బదిలీ చేసి ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి జయేశ్‌రంజన్‌ను తప్పించారు. కె.మనిక్కారాజ్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీచేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి రాహుల్‌ బొజ్జాను తప్పించారు. పౌసుమి బసు, శ్రుతి ఓఝాలను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా, ఎం.హరితను విద్యాశాఖ ఉప కార్యదర్శిగా, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఎంసీహెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీచేశారు.  

మరిన్ని వార్తలు