చార్జీల పెంపుపై త్వరలో సీఎంను కలుస్తాం

29 Apr, 2022 03:24 IST|Sakshi
నర్సింగ్‌ కళాశాల ప్రారంభ కార్యక్రమంలో పువ్వాడ, బాజిరెడ్డి, సజ్జనార్‌ తదితరులు  

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్‌ చార్జీల పెంపుపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సంప్రదిం చనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో ఆర్టీసీపై రూ.వందల కోట్ల భారం పడుతోందని, అయినప్ప టికీ ఇప్పటి వరకు ఆ భారం ప్రజలపై పడకుండా ఆర్టీసీ భరించిందని అన్నారు.

తీవ్రమైన నష్టాల్లో నడుస్తున్న సంస్థను బలోపేతం చేసేందుకు చార్జీలు పెంచక తప్పనిపరిస్థితి నెలకొందన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సింగ్‌ కళాశాలను మంత్రి గురువారం ప్రారంభించారు. మొదటి బ్యాచ్‌లో 50 మంది విద్యార్థినులతో దీనిని మొదలు పెట్టారు. ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, పలువురు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు