రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి

9 Nov, 2022 00:33 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌ను కలిసిన ట్రెసా ప్రతినిధుల బృందం   

కేటీఆర్‌కు ట్రెసా వినతి 

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. మంగళవారం తమ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించిన ట్రెసా.. ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు చేసింది.  సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధి బృందం ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించింది.

శాఖలో పనిభారం ఎక్కువయిందని, వెంటనే కేడర్‌ స్ట్రెంగ్త్‌ను నిర్ధారించాలని, పదోన్నతులివ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, ధరణి అంశాలను పరిష్కరించాలని, వీఆర్‌ఏలకు పేస్కేల్‌ అమలు చేయాలని కోరింది. తమ వినతి పట్ల మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని, హామీల అమలుకు రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారని ట్రెసా ప్రతినిధులు వెల్లడించారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్‌కుమార్, అసోసియేట్‌ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, ఉపాధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి జగన్‌మోహన్‌రెడ్డి, నిర్మల, శ్రవణ్‌లతో పాటు పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు