మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ 

26 Jan, 2021 02:21 IST|Sakshi

ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు ఈ ఘనత దక్కింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు.  

అవార్డు రావడం సంతోషంగా ఉంది 
నాకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఉంది. ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన ఇచ్చాను. బహుమతిగా గుస్సాడీ టోపీ కూడా ఇచ్చాను. హన్ను మాస్టారు స్పూర్తితో ముందుకు సాగుతున్నా. – కనక రాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.   

మరిన్ని వార్తలు