అటవీశాఖ అధికారులపై ఆదివాసీలు కర్రలతో దాడి

13 Jul, 2021 18:45 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: గంగారం మండలం మడగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడుభూముల్లో సాగు చేస్తున్న ఆదివాసీలను మంగళవారం ఫారెస్ట్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అటవీ అధికారులతో ఆదివాసులు వాగ్వాదానికి దిగారు. గిరిజనులు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ వాగ్వాదం ముదరడంతో ఆదివాసీలు కర్రలతో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. పలువురు గిరిజన మహిళలు సాగును అడ్డుకున్నందుకు అటవీ అధికారులపై దాడి చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పలువురు ఆదివాసీ రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు