చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ మూడు రంగులు..

28 Nov, 2022 08:04 IST|Sakshi

శాయంపేట: చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ.. సమయాన్నిబట్టి రంగులు మారుతోంది. అదే మందార ముటాబిలిసి పువ్వు ప్రత్యేకత. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు తన ఇంటి ఆవరణలో దక్షిణ చైనా, తైవాన్‌ దేశాలకు చెందిన మందార ముటాబిలిసి అనే మొక్కను నాటాడు.

దీనిని కాన్ఫెడరేట్‌ గులాబీ, డిక్సీ రోజ్‌మల్లో, కాటన్‌ రోజ్‌ లేదా కాటన్‌ రోజ్‌మల్లో అని కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ఆదివారం ఈ మొక్కకు అరుదైన పుష్పం వికసించింది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారడం ఈ పువ్వు ప్రత్యేకత. ఒకేరోజు మూడు రంగుల్లో వికసించడంతో స్థానికులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
చదవండి: టాప్‌గేర్‌లో ఎంసెట్‌... రివర్స్‌లో జేఈఈ

>
మరిన్ని వార్తలు