సర్కారు ఉద్యోగుల అసమ్మతి

5 Dec, 2020 08:06 IST|Sakshi

 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో టీఆర్‌ఎస్‌ వెనుకంజ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు..

 ఉద్యోగ వర్గాల సమస్యలు పరిష్కరించకపోడమే కారణం  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార టీఆర్‌ఎస్‌ పారీ్టకి వ్యతిరేకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేసి తమ అసమ్మతి తెలియజేస్తున్నారు.  గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి రాగా, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు లభించాయి. 
ఉద్యోగుల సమస్యల పెండింగ్‌ వల్లే.. ఎన్నికల విధుల్లో ఉండే ఎన్నికల సిబ్బందితో పాటు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసే సైనికులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కలి్పస్తారు. ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను దక్కించుకోవడంలో వెనకబడిన అధికార టీఆర్‌ఎస్‌.. సాధారణ ప్రజానీకం ఈవీఎం/బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా వేసే ఓట్లను దక్కించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంది.

ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీఎన్జీవోలు, ఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా కేసీఆర్‌ ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉండటంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను దక్కించుకోవడంలో టీఆర్‌ఎస్‌ వెనకబడిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కొత్త పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదలలో తీవ్ర జాప్యం, ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచకపోవడం, స్పౌజ్‌ కేటగిరీ కింద బదిలీలు చేపట్టకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చాలాకాలం నుంచి కోరుతున్నాయి. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్‌ గత మూడేళ్లలో పలుమార్లు హామీనిచి్చనా, నెరవేర్చలేకపోయారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేక భావం ఏర్పడిందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 

అసెంబ్లీ ఓట్ల నుంచి జీహెచ్‌ఎంసీ వరకు.. 
ఇక 2018లో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 95,689 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలవ్వగా, అత్యధికంగా కాంగ్రెస్‌ పారీ్టకి 38,918, టీఆర్‌ఎస్‌కు 32,880, బీజేపీకు 9,567 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేయగా, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమికి వచ్చిన మొత్తం పోస్టల్‌ ఓట్ల సంఖ్య 46,651 కావడం గమనార్హం. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మొత్తంగా 46.87 శాతం ఓట్లను సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ 28.43 శాతం ఓట్లతో 19 సీట్లు, బీజేపీ 6.98 శాతం ఓట్లతో కేవలం ఒకే సీటును గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం పోలైన 906 పోస్టల్‌ ఓట్లలో బీజేపీకు 515 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు కేవలం 218 ఓట్లు మాత్రమే లభించాయి. ఎంఐఎంకు 50, కాంగ్రెస్‌కు 40, ఇతరులకు 20 ఓట్లు వచ్చాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత కొన్నేళ్లుగా అసమ్మతి తెలియజేస్తున్నా, ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.   

మరిన్ని వార్తలు