బతుకమ్మల పైనుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కారు?.. మండిపడ్డ వీహెచ్‌

8 Oct, 2021 10:53 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రంగు రంగు పూలను పేర్చి, ఆట పాటలతో అమ్మను కొలిచే ఈ పండగకు తెలంగాణ యావత్తూ పూలవనంలా మారిపోయింది. అలాంటి బతుకమ్మ పట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు. మహిళలంతా బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆడుతుండగా వాటిపైనుంచి ఎమ్మెల్యే కారు పోనిచ్చారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.


మాట్లాడుతున్న ఏఐసీసీ మెంబర్‌ హన్మంతరావు

మహిళలు బతుకమ్మ ఆడుతుండగా తన వాహనంతో తొక్కించి మహిళలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అవమానపరిచిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై చర్య తీసుకోవాలని ఏఐసీసీ మెంబర్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు డిమాండ్‌ చేశారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలు బతుకమ్మ ఆడుకుంటుండగా బతుకమ్మలపై నుంచి తన వాహనాన్ని తీసుకెళ్లిన ధర్మారెడ్డి.. మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. గతంలో ఎస్సీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారని గుర్తుచేశారు. ఆత్మకూరు సర్పంచ్‌ రాజు బీసీ కావడం వల్లే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలా వ్యవహరిస్తున్నాడన్నారు.
చదవండి: గర్భం దాల్చిన బాలిక.. అబార్షన్‌పై టీఎస్‌ హైకోర్టు కీలక తీర్పు

సలేం జరిగింది
ఆత్మకూరు పోచమ్మ సెంటర్‌ వద్ద ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయం ఎదుట మహిళలు బతుకమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు. అదే సమయంలో  పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వస్తున్నారని, రోడ్డుపై నుంచి బతుకమ్మలు తీసివేయాలని మహిళలను ధర్మారెడ్డి అనుచరులు కోరారు. ఎంతో భక్తితో ఆడుకుంటున్న బతుకమ్మలను మధ్యలో తీసివేయలేమని మహిళలు చెప్పారు. దీంతో బతుకమ్మ ఆడుతున్న మహిళలను తోసేసి ఎమ్మెల్యే కారును బతుకమ్మల మీదుగా ముందుకు పోనిచ్చారని స్థానికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చదవండి: పెద్దమనసు చాటుకున్న కేటీఆర్‌ 

మరిన్ని వార్తలు