బాధిత చిన్నారులను చూసి కంటతడి పెట్టిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సింధే

11 May, 2022 21:09 IST|Sakshi

నిజాంసాగర్‌/పిట్లం/పెద్దకొడప్‌గల్‌/బాన్సువాడ టౌన్‌/నిజామాబాద్‌ అర్బన్‌: అన్నాసాగర్‌ తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సింథే అన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో తల్లులను కోల్పోయిన చిన్నారులను చూసి ఎమ్మెల్యే తీవ్రంగా చలించి కంటతడి పెట్టారు.
చదవండి👉🏾 అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి..

ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడం బాధాకరం అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలందరి గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు రైతు బీమాకు అర్హులని, మిగతావారు టీఆర్‌ఎస్‌ సభ్యత్వం కల్గిన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట సొసైటీ చైర్మన్‌ హన్ముంత్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ లక్ష్మరెడ్డి, సర్పంచ్‌ రమేష్, నాయకులు లచ్చిరెడ్డి, విజయ్, రహిమతుల్లా, విజయ్, విజయ్‌ దేయ్, పాల్గొన్నారు.  
చదవండి👉🏻 చదివింపులు.. రూ. అరకోటి!

మరిన్ని వార్తలు