‘కండువా కప్పుకుంటేనే డబుల్‌ బెడ్రూం ఇల్లు’

19 Feb, 2021 02:25 IST|Sakshi

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి 

సాక్షి, జనగామ: ‘పార్టీలో పదవులు రాలేదని చీటికిమాటికి కొట్లాటలు వద్దు. ఉద్యమ సమయం నుంచి నేను పార్టీలో కష్టపడి పనిచేసిన. అయినా నిన్నకాక మొన్న టీఆర్‌ఎస్‌లో చేరిన వారు మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. దీనికి నేనేమైనా కొట్లాట చేశానా? అన్నింటికీ అధినేత సీఎం కేసీఆర్‌ ఉన్నారనే భరోసా ఉంది’ అంటూ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట, పాలకుర్తి, ఉప్పల్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. కేసీఆర్‌ను నమ్ము కోవడంతో జనగామ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. మనకు మనం మనస్పర్థలకు వెళ్లి, పార్టీకి చెడ్డ పేరు తేవొద్దని హితవు పలికారు. ఇక నుంచి పార్టీ శ్రేణులు చెప్పినోళ్లకే పథకాలు వస్తాయని, కండువా కప్పుకుంటేనే డబుల్‌ బెడ్రూం ఇల్లు దక్కు తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు