మల్కాజ్‌గిరిలో అడుగు పెడితే గుండు పగులుద్ధి: మైనంపల్లి

15 Aug, 2021 16:49 IST|Sakshi
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (ఫైల్‌)

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై కేసు నమోదైంది. కాగా, మల్కాజ్‌గిరిలో బీజేపీ కార్యకర్తపై.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి ఘటనలో మైనంపల్లితో పాటు.. మరో 15 మంది కార్యకర్తలపై స్థానిక పోలీసులు కేసులను నమోదు చేశారు. కాగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి నిరసనగా రేపు బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా స్పందించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. మల్కాజ్‌గిరిలో అడుగు పెడితే గుండు పగులుద్ధి అని హెచ్చరించారు. అదే విధంగా, బండి సంజయ్‌కు దమ్ముంటే తన ముందు ఆరోపణలు చేయాలని సవాల్‌ విసిరారు. కాగా, బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎంపీకి తక్కువ అని విమర్శించారు. ఇవాల్టి నుంచి బండి సంజయ్‌ భరతం పడతానన్నారు. అదేవిధంగా.. సంజయ్ రాసలీలలను త్వరలోనే మీడియా ముందు పెడతానని అన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు