యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలుకు కేటీఆర్‌ 

27 Jun, 2022 01:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్‌సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారక రామారావుతో సహా కొంతమంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం.

యశ్వంత్‌ సిన్హాకు మద్దతునిస్తున్నట్లు అధికారికంగా టీఆర్‌ఎస్‌ నుంచి ప్రకటన రాకున్నా కేటీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరవుతుండటం గమనార్హం. విపక్షాలతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ ఉందనే సంకేతాలు పంపించడానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హాజరవుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు