భారీ వాహనం.. బహుదూరపు ప్రయాణం

2 Jun, 2021 18:11 IST|Sakshi

ఈ భారీ వాహనం ఏదో రాకెట్‌ను తీసుకువెళ్తున్నట్టు కనిపిస్తోంది కదా..? కానే కాదు. అది ఆయిల్‌ ప్లాంట్‌లో వాడే ఓ భారీ పరికరం. దాన్ని గుజరాత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి తరలిస్తున్నారు. పరికరం పెద్దది కావడంతో దానికి తగ్గట్లే 106 టైర్లున్న భారీ వాహనంలో తీసుకెళుతున్నారు.


20 రోజుల క్రితం గుజరాత్‌లో బయల్దేరిన ఈ వాహనం మంగళవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని 65వ నంబర్‌ జాతీయ రహదారి మీదుగా ప్రయాణించింది. రోడ్డు మీద ఇంత పెద్ద వాహనం కనిపించడంతో అందరూ ఆసక్తిగా చూశారు. కాగా, ఈ భారీ వాహనాన్ని నడిపేందుకు ముగ్గురు డ్రైవర్లు, మరో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు