తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా..

27 Sep, 2021 18:12 IST|Sakshi

అప్‌ డేట్స్‌:
తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు మంగ‌ళ‌వారానికి వాయిదా ప‌డ్డాయి.

►తెలంగాణ శాసనమండలి రేపటికి వాయిదా...

సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశాల్లో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

మండలిలో ఎమ్మెల్సీ కవిత తొలి ప్రసంగం
►శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలి ప్రసంగం చేశారు. మండలిలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం 15 ఫైనాన్స్ కమిషన్‌లో రూ. 500 కోట్లు లోటు పెట్టినా, స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా రూ. 500 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇంకా కొన్ని లోటు పాట్లు ఉన్నాయని, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నానని అన్నారు.

►కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీపీలకు కార్యాలయాలు లేవని అన్నారు. ఎంపీటీసీలకు కూడా గ్రామపంచాయతీలో కూర్చోడానికి కుర్చీ లేదని, తగిన ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. చట్టాన్ని సవరణ చేసి అయినా సరే పాఠశాలలో జెండా ఎగురవేసే అధికారం ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కల్పించాలన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని రోడ్ల పరిస్థితులపై సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభలో సభ్యులు లేవనేత్తిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రూ.2 వేల కోట్లతో 22 ఫ్లై ఓవర్లు, అండర్‌ పాసులు పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రహదారుల నిర్మాణానికి రూ. 5,900 కోట్ల రుణం తీసుకున్నామని అన్నారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల 132 లింక్‌ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో రూ. 450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు