TS Assembly Sessions: ‘కేంద్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది’

4 Oct, 2021 13:38 IST|Sakshi

► అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ మట్లాడుతూ.. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. పద్మ శ్రీ అవార్డుల విషయంలో రాష్ట్రంపై విపక్ష చూపుతోందని అ‍న్నారు. రాష్ట్రంలో అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఉందని అ‍న్నారు. పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోవడంలేదని అన్నారు. పధాని, హోం మంత్రిని కలిసినా ప్రయోజనం లేదని తెలిపారు. 

హైదరాబాద్‌ అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. పాతబస్తీ అభివృద్ధిపై సమగ్ర చర్చ జరుపుతామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెరువులకు చైన్‌ సిస్టమ్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో నాలాల విస్తరణకు చర్యలు చేపట్టామని తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ నాలుగో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతోంది. అనంతరం ఉభయ సభల్లో తెలంగాణ ప్రైవేటు యూనివర్సిటీ నిబంధనలు–2019కి సవరణలకు సంబంధించిన పత్రాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమర్పించనున్నారు. శాసనసభలో ‘రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలు’, ‘హైదరాబాద్‌ పాత నగరంలో అభివృద్ధి’పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.

స్వల్పకాలిక చర్చ అనంతరం గత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు ప్రభుత్వ బిల్లుల ఆమోదం కోసం చర్చ జరుగుతుంది. అదేవిధంగా శాసనమండలిలో హరితహారంపై స్వల్పకాలిక చర్చతోపాటు ఈ నెల 1న శాసనసభ ఆమోదించిన నాలుగు ప్రభుత్వ బిల్లులపై చర్చ జరుగనుంది.

మరిన్ని వార్తలు