టీఎస్‌ ఈసెట్‌ 2021: ముఖ్యసమాచారం

5 Apr, 2021 12:39 IST|Sakshi

తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(టీఎస్‌ ఈసెట్‌)–2021 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈసెట్‌ ద్వారా బీటెక్‌/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో (లేటరల్‌ ఎంట్రీ) ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/బీఎస్సీ(మ్యాథ్స్‌) ఉత్తీర్ణులు ఈసెట్‌ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్‌ పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్‌ ఫార్మసీ విద్యార్థులకు బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా టీఎస్‌ ఈసెట్‌ నోటిఫికేషన్‌ పూర్తి సమాచారం...

అర్హతలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్యా మండళ్లు గుర్తించిన డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ/ఫార్మసీ ఉత్తీర్ణులు; మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌కు హాజరవ్వొచ్చు. బీఎస్సీ మ్యాథ్స్‌ అభ్యర్థులకు బీఫార్మసీలో ప్రవేశానికి అర్హత లేదు. ఆయా కోర్సులు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కోర్సులో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత 40 శాతం. 

పరీక్ష స్వరూపం
ఈసెట్‌  పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు.

ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌
ఇంజనీరింగ్‌ డిప్లొమా హోల్డర్లు ఈ స్ట్రీమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.

► మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్‌ పేపర్‌(విభాగం) మాత్రం అభ్యర్థి బ్రాంచ్‌ ఆధారంగా ఉంటుంది.

బీఎస్సీ(మ్యాథ్స్‌)
బీఎస్సీ మ్యాథ్స్‌ ఉత్తీర్ణులకు పరీక్ష స్వరూపం కింది విధంగా ఉంటుంది.

ఫార్మసీ స్ట్రీమ్‌

అర్హత మార్కులు
అభ్యర్థులు నాలుగు సబ్జెక్టుల్లో(బీఎస్సీ అభ్యర్థులకు మూడు సబ్జెక్టులు) కలిపి సగటున కనీసం 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు వర్తించవు.

అర్హత– బ్రాంచ్‌లు
► టీఎస్‌ ఈసెట్‌ సబ్జెక్టు పేపర్లు వారీగా అర్హత డిప్లొమా స్పెషలైజేషన్స్‌....
► కెమికల్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌: సిరామిక్, లెదర్, టెక్స్‌టైల్, కెమికల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌–పెట్రోకెమికల్,కెమికల్‌ ప్లాస్టిక్స్‌ అండ్‌ పాలిమర్స్, కెమికల్‌ ఆయిల్‌ టెక్నాలజీ, కెమికల్‌–షుగర్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ. 
► సివిల్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌: సివిల్, సివిల్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ.
► ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌: కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్, స్పెషల్‌ డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌ విత్‌ కంప్యూటర్, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ. 
► ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌.
► మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌: ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ,డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ. 
► మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌: మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌.
► మైనింగ్‌ ఇంజనీరింగ్‌ పేపర్‌: మైనింగ్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌. 

ముఖ్యసమాచారం
► ఆన్ లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: మే 17,2021
► దరఖాస్తు ఫీజు: జనరల్‌ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400.
► పరీక్ష తేదీ: జూలై 1, 2021
► ఉదయం సెషన్‌ (ఉ.9 గం–మ.12 గం)–ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ పేపర్లు
► మధ్యాహ్నం సెషన్‌ (మ.3 గం–సా.3 గం)–సీఐవీ, సీహెచ్‌ఈ, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం పేపర్లు. 
► వెబ్‌సైట్‌:  https://ecet.tsche.ac.in

మరిన్ని వార్తలు