TS: డిసెంబర్‌ 1 నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

25 Nov, 2021 14:42 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ డిసెంబర్‌ 1 నుంచి మొదలవుతుందని తెలంగాణ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు. 1 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, 18–20 తేదీల మధ్య వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని సూచించారు. 24వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు వచ్చిన అభ్యర్థులు డిసెంబర్‌ 28లోగా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలన్నారు. 30వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు. (‘వడ్లు దంచంగా రాడే.. వండంగ రాడే’.. ఈ పాట ఎక్కడైనా విన్నారా)
  
27 నుంచి లాసెట్‌ కౌన్సెలింగ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: లాసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 27 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలంగాణ లాసెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు. 27 నుంచి డిసెంబర్‌ 6 వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 11 నుంచి 13 వరకు కాలేజీల ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. డిసెంబర్‌ 17న సీట్ల కేటాయింపు ఉంటుందని, సీటు పొందిన అభ్యర్థులు వచ్చే నెల 23 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలన్నారు. మూడేళ్ల, ఐదేళ్ల న్యాయవాద కోర్సుల తరగతులు డిసెంబర్‌ 27 నుంచి మొదలవుతాయని తెలిపారు. (చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌)

మరిన్ని వార్తలు