‘ఆర్‌అండ్‌బీ’కి మెడికల్‌ ప్రాజెక్టులు.. 

3 Jul, 2021 07:56 IST|Sakshi

రూ.10 వేల కోట్ల అంచనాలతో పనులు

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్‌ కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణ బాధ్యతను రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త సచివాలయం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణంలో తలమునకలై ఉన్న రోడ్లు, భవనాల శాఖ త్వరలో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్ట నుంది. నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రు లు, ఏడు మెడికల్‌ కాలేజీలు, 13 నర్సింగ్‌ కాలే జీలను నిర్మించాలని ఇటీవలే కేబినెట్‌ నిర్ణయిం చిన విషయం తెలిసిందే.

వీటి నిర్మాణానికి దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మెడికల్‌ ప్రాజెక్టుకు సంబంధించి త్వర లో ఆర్‌ అండ్‌ బీ స్థలాల పరిశీలన ప్రారంభించ నుంది. ఆ తర్వాత డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు పిలవనుంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. అలాగే మెడికల్‌ ప్రాజెక్టు పూర్తి కోసం ఖాళీలు భర్తీ చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. పలు కేటగిరీలకు చెందిన 200 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రతిపాదించింది.

నిర్మించాల్సిన కొత్త మెడికల్‌ కాలేజీలు..
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు
కొత్త నర్సింగ్‌ కళాశాలలు: సంగారెడ్డి, మహబూ బాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూలు, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట
కొత్త సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు: వరంగల్, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి, కొత్తపేట పండ్ల మార్కెట్‌ స్థలం, అల్వాల్‌–ఓఆర్‌ఆర్‌ మధ్య. 
 

మరిన్ని వార్తలు