తొలిరోజు రూ. 516 కోట్లు.. నేడు మరో రూ.1,152.46 కోట్లు

16 Jun, 2021 08:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

16.95 లక్షల మంది రైతులకు వానాకాలం రైతుబంధు సొమ్ము జమ 

ఎకరాలోపు రైతులకు జమ చేసిన ప్రభుత్వం 

నేడు 15.07 లక్షల మందికి రూ.1,152.46 కోట్లు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌కు గాను రైతుబంధు నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు ఈ జమ కార్యక్రమం ఉంటుంది. తొలిరోజు 16.95 లక్షల మంది రైతులకు రూ. 516.95 కోట్లు వారి బ్యాంకు ఖాతా ల్లో జమయ్యాయని వ్యవసాయశాఖ వెల్లడించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,11,970 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 36.10 కోట్లు జమయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా లో అత్యల్పంగా 9,628 మంది రైతుల ఖాతా ల్లోకి రూ. 35.60 లక్షలు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10,33,915 ఎకరాలకు చెందిన 16,95,601 మంది రైతుల ఖాతాల్లోకి నిధులు చేరినట్లు అధికారులు తెలిపారు.

రెండోరోజు 2 ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకుగాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1,152.46 కోట్లు జమ చేస్తామని వెల్లడించారు. రెండో రోజు కూడా నల్లగొండ జిల్లాలో అత్యధికంగా1,10,407 మంది రైతుల ఖాతాలకు రూ. 85.23 కోట్లు జమ చేస్తారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ మంత్రి నిరం జన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా ట్విట్టర్‌ వేదికగా మొదటి రోజు రైతుల ఖాతా ల్లో సొమ్ము జమయినట్లు చెప్పారు. రైతులకు అభినందలు తెలిపారు. కాగా, ఈ సీజ¯Œ లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల (కోటిన్నర) ఎకరాలకు రూ. 7,508.78 కోట్లు రైతుబంధు నిధులు ఇవ్వనున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు