వరద బాధితులకు సాయం చేయండి: తమిళిసై

24 Jul, 2021 10:00 IST|Sakshi

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి గవర్నర్‌ తమిళిసై పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. శుక్రవారం పుదుచ్చేరి నుంచి రాజ్‌భవన్‌ అధికారులు, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లాల ప్రతినిధులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి, పంట నష్టం జరగడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశా రు. రాష్ట్రంలో డెంగీ, మలేరియా లాంటి సీజన ల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు అవసరమైన సాయమందించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూ చించారు. సమావేశంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతి నిధులు, రాజ్‌భవన్‌ అధికారులు పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు