‘అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం’

14 Apr, 2022 15:12 IST|Sakshi
హబ్సిగూడలో కూల్చివేసిన షెడ్డు (ఫైల్‌) 

ఉప్పల్‌: ఉప్పల్‌ సర్కిల్‌ మున్సిపల్‌ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హబ్సిగూడలోని వివేకానందనగర్‌లో గత నెల 25వ తేదీన రేకుల షెడ్డును మున్సిపల్‌ అధికారులు నోటీసు గడువు ముగియక ముందే తొలగించారు. దీన్ని సవాల్‌ చేస్తూ బాధితుడు పి.నర్సింహరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం మున్సిపల్‌ అధికారుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూల్చివేతలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకుని, బాధితునికి నష్టపరిహారం ఇవ్వాలని సూచిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు బుధవారం బాధితుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కక్షపూరితంగానే ఉప్పల్‌ డిప్యూటీ కమిషనర్‌ అరుణకుమారి, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ వెంకటరమణ తమ కార్యాలయ షెడ్డును కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు