'ధరణి'పై స్టే మళ్లీ పొడిగింపు

22 Jan, 2021 14:43 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'ధరణి' పోర్టల్‌పై స్టేను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై జూన్‌ 21 వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. ధరణిపై నమోదైన అభ్యంతరాలపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా.. అటార్నీ జనరల్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. అభ్యంతరాలను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని, ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. 

ధరణిపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలు కాగా, అందులో ఇదు పిటిషన్లు ఒకే అంశంపై దాఖలైనవే కాబట్టి వాటిపై విచారణ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం రెండు పిటిషన్లపై మాత్రమే విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. ఈ రెండు పిటిషన్లపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ జరుపుతోంది. కాగా, ధరణిలో ఇదివరకే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కాగా, వ్యవసాయేతర భూముల నమోదు మాత్రం వాయిదా పడుతూ వస్తుంది. 

మరిన్ని వార్తలు