లాకప్‌ డెత్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

17 Sep, 2020 15:11 IST|Sakshi

కాల్ డేటా అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: మంథిని శీలం రంగయ్య లాకప్‌ డెత్‌ అంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. గతంలో ఈ కేసులో స్పెషల్‌ అధికారిగా హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ను నియమించిన సంగతి తెలిసిందే. శీలం రంగయ్య డెత్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను సీపీ అంజనీకుమార్ కోర్టుకు సమర్పించారు. రామగుండం సీపీ కాల్ డేటా హైకోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. సీపీ సమర్పించిన అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ నాగమణి పేర్కొన్నారు. తదుపరి విచారణ ఆరు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. 

>
మరిన్ని వార్తలు