గణేష్‌ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

13 Sep, 2021 15:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గతేడాది కూడా నిమజ్జనంపై ఇచ్చిన ఉత్తర్వులను పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన జీహెచ్‌ఎంసీ.. అనుమతి కోరడం ఏంటని ప్రశ్నించింది. గణేష్‌ నిమ్మజ్జనంపై ఏ ఒక్క మినహాయింపు కూడా ఇవ్వలేమని, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

కాగా వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్‌ఎంసీ సోమవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కోరింది. హుస్సేన్‌ సాగర్‌, ఇతర జలాశయాల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌  విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ట్యాంక్‌ బండ్‌ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్‌ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
చదవండి: హైదరాబాద్‌: వినాయక విగ్రహాల నిమజ్జనం ఎక్కడ?

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు