టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు 

24 Jun, 2021 08:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేయూ క్యాంపస్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగించారు. అర్హులైన వారు ఎలాం టి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌ ఐసెట్‌ కన్వీ నర్, కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు కె.రాజిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల గడువు బుధవారంతో ముగియగా, మళ్లీ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను టీఎస్‌ ఐసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు.  

ఆర్‌జేసీసెట్‌–21 అర్హుల జాబితా విడుదల 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఫస్టియర్‌ ప్రవేశాల కోసం ఆర్‌జేసీసెట్‌–21కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల పదో తరగతి మార్కుల ఆధారంగా అర్హత కల్పిస్తూ రూపొందించిన ప్రాథమిక జాబితాను బుధవారం విడుదల చేశారు. ఈ జాబితా టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీలోపు హాల్‌టికెట్, కుల ధ్రువీకరణ, బదిలీ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ, పాస్‌ఫొటోలు తదితర ధ్రువపత్రాలతో ఎంపికైన కాలేజీలో రిపోర్టు చేయాలని సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రిపోర్టు చేయకుంటే ఆ విద్యార్థి అనర్హుడవుతారని స్పష్టంచేశారు.   

జూలై 18న గురుకుల ప్రవేశ పరీక్ష 
సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(టీజీసెట్‌–21)ను వచ్చేనెల 18న నిర్వహించాలని సెట్‌ కన్వీనర్‌ నిర్ణయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల లో ఐదోతరగతికి సంబంధించి 47వేల సీట్లున్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఆన్‌లైన్‌ దర ఖాస్తులు ఆహ్వానించగా... దాదాపు 1.35లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 
 

మరిన్ని వార్తలు