రేషన్ డీలర్ల సమ్మె ఆలోచన విరమణ

1 Jun, 2021 15:33 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

రేషన్‌ డీలర్లతో మంత్రి గంగుల చర్చలు సఫలం

సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్లు నెరవేర్చాలంటూ రేషన్‌ డీలర్లు మంగళవారం నుంచి సమ్మె నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి గంగుల కమాలకర్‌ రేషన్‌ డీలర్ల సంఘం నేతలతో జరిపిన  చర్చలు సఫలం అయ్యాయి. ఫలితంగా రేషన్ డీలర్ల సమ్మె ఆలోచన విరమించుకునేందుకు సిద్ధమయ్యారు. 

చర్చల్లో భాగంగా రేషన్ డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ పాత బకాయిలు రూ.28 కోట్లు విడుదల చేస్తామని.. కరోనాతో మరణించిన రేషన్ డీలర్ల స్థానంలో ఎటువంటి నిబంధనలు లేకుండా.. వారి కుటుంబ సభ్యులకే రేషన్ డీలర్ పోస్టు ఇస్తామని మంత్రి గంగుల హామీ ఇచ్చారు. రేషన్ డీలర్ల కమీషన్‌ పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు