యాసంగిలో వరి వద్దు.. ప్రభుత్వం కొనదు: నిరంజన్‌ రెడ్డి

6 Nov, 2021 17:45 IST|Sakshi

యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించిన మంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు​.. ప్రభుత్వం కొనలేదని బదనాం వద్దు’’ అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి. యాసంగి పంటల సాగుపై ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానం ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు.. దానికి బదులు ఇతర పంటలు వేసుకోవాలి’’ అని తెలిపారు.
(చదవండి: కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి)

‘‘విత్తన కంపెనీలతో ఒప్పందం ఉంటే రైతులు యాసంగిలో వరి సాగు చేయవచ్చు.  రైస్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి వేసుకోవచ్చు. అయితే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్స్‌పోర్ట్స్‌ అనుమతులు ఉండవు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతులు అర్ధం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’’ అని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

చదవండి: ‘వరి’ని నిషేధిత జాబితాలో చేర్చారా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

>
మరిన్ని వార్తలు